ఈ సీజన్ లో దొరికే పచ్చి మామిడికాయ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు     2018-03-31   22:29:12  IST  Lakshmi P

వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసిన పచ్చి మామిడికాయ కన్పిస్తూ ఉంటుంది. పచ్చి మామిడికాయ తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అందుకే ఈ సీజన్ లో చాలా మంది మామిడికాయలు తింటూ ఉంటారు. అయితే చాలా మంది పండిన మామిడికాయను తింటూ ఉంటారు. ఆలా కాకుండా పచ్చి మామిడికాయను తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

వేసవికాలంలో తరచుగా శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతూ ఉంటుంది. పచ్చి మామిడికాయ జ్యుస్ త్రాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా చూడటమే కాకుండా శరీరంలో ఉండే ముఖ్యమైన మినరల్స్ బయటకు పోకుండా కాపాడుతుంది.

పచ్చి మామిడికాయ తినటం లేదా జ్యుస్ త్రాగటం వలన వేసవిలో సహజంగా వచ్చే మార్నింగ్ సిక్‌నెస్, మలబద్దకం, డయేరియా, అజీర్ణం, గ్యాస్ సమస్యల వంటి అనేక జీర్ణ సమస్యలు తగ్గుతాయి.