భోజనం చేసిన తర్వాత సోంపు తింటున్నారా.? అయితే ఈ 9 విషయాలు తప్పక తెలుసుకోండి!     2018-06-28   03:37:58  IST  Lakshmi P

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తిన‌డం మ‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కానీ ఈ జంక్‌ఫుడ్ యుగంలో ఆ పాత ప‌ద్ధ‌తిని మ‌రిచిపోయాం. దీంతోపాటు అలాంటి ఆహారం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటున్నాం. కానీ భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా వాత‌, పిత్త దోషాల వ‌ల్ల క‌లిగే రోగాలు న‌య‌మ‌వుతాయి. ఈ క్రమంలో సోంపు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌కు…

అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో నేటి త‌రుణంలో చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్రమంలో అలాంటి స‌మ‌స్య‌లు ఉన్నవారు భోజ‌నం చేసిన వెంట‌నే 1 టీస్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే దాని వ‌ల్ల జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

అధిక బ‌రువుకు…

వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్య ఇట్టే తొల‌గిపోతుంది. ఎందుకంటే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా బ‌య‌టికి పోతుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

దంత సమ‌స్య‌ల‌కు…

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.