నేరేడు పండ్లను తినటం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు     2018-04-29   23:27:49  IST  Lakshmi P

నిగనిగలాడుతూ.. నోరూరించే నేరేడు పండ్లు మనకు మార్కెట్ లో విరివిరిగా లభ్యం అవుతున్నాయి. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తినటం వలన మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అంది అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఇప్పుడు నేరేడు పండ్లను తినటం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

నేరేడు పండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు లభిస్తాయి.

నేరేడు పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన నేరేడు పండ్లను తినటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.