పచ్చిమిరపకాయలు రోజు తినాలి….ఎందుకో తెలుసా?

సాధారణంగా మనం ప్రతి రోజు వంటల్లో పచ్చిమిర్చిని వాడుతూనే ఉంటాం. చాలా మంది కూరల్లో ఎర్ర కారానికి బదులుగా పచ్చిమిర్చిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కూరల్లో పచ్చిమిర్చిని వాడటం వలన వంటకు మంచి రుచి వస్తుంది. అయితే పచ్చిమిర్చి తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

పచ్చిమిర్చిలో విటమిన్ సి,విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.

పచ్చిమిర్చిని గింజలతో కలిపి తినటం వలన జీర్ణశక్తి మెరుగుపడి అజీర్ణం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. చాలా మంది పచ్చిమిర్చిని ఉపయోగించినప్పుడు గింజలను తీసేస్తూ ఉంటారు. అలాంటి వారు గింజలు తీయకుండా తినటం అలవాటు చేసుకోవాలి.