Health Benefits of Eating Avocado Seeds

అవోకాడోను చాలా మంది ఇష్టపడే సూపర్ ఆహారం అని చెప్పవచ్చు. పండిన అవోకాడోను శాండ్విచ్లు, స్మూతీస్, సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. అంతేకాక ఫేస్ పాక్స్ లలో కూడా ఉపయోగిస్తారు. అయితే అవోకడో విత్తనాన్ని దూరంగా పడేస్తూ ఉంటాం. కానీ దానిలో యాంటిఆక్సిడెంట్, ఫైబర్ మరియు ఫినోలిక్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది. ఈ విత్తనాలు చేదు మరియు వగరు రుచిలో ఉంటాయి.

1. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది
అవోకాడో విత్తనాలలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. నిజానికి పండులో కంటే విత్తనంలోనే 70 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీఆక్సిడాంట్లు ఫ్రీ రాడికల్స్ ని దూరం చేసి,రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి బాక్టీరియా, వైరల్ అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది.

2. హై కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
అవోకాడో గుజ్జులో అసంతృప్త కొవ్వులు సమృద్దిగా ఉండుట వలన అధిక స్థాయిలో ఉన్న లైపోప్రోటీన్ (LDL లేదా చెడు కొలెస్ట్రాల్) తగ్గించేందుకు సహాయం మరియు హై-డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL లేదా మంచి కొలెస్ట్రాల్) పెంచుకోవటానికి సహాయపడుతుంది. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాక కరిగే ఫైబర్ ఉండుట వలన గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.