ఉదయాన్నే పరగడుపున 4 కరివేపాకులు తింటే ఏమి జరుగుతుందో తెలుసా?     2017-10-27   21:45:03  IST  Lakshmi P

Health Benefits of Curry Leaves In Telugu

కరివేపాకు అంటే మన అందరికి తెలుసు. తప్పనిసరిగా కూరల్లో వేస్తూ ఉంటాం. కూరల్లో వేయటం వలన కొరకు రుచి కూడా వస్తుంది. ఇంతవరకు అందరికి తెలుసు. కానీ కరివేపాకులో ఉన్న పోషక విలువల గురించి ఎవరికీ తెలియదు. సాధారణంగా అందరు కూరల్లో వేసిన కరివేపాకును తీసి పడేస్తూ ఉంటారు. కానీ కరివేపాకు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కరివేపాకులో కోహినిజెన్ అనే గ్లుకోజైడ్ అనే పదార్ధం ఉండుట వలన కరివేపాకు రుచి,వాసన ఆలా ఉంటాయి. కరివేపాకు లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పిండి పదార్ధాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మనం ప్రతి రోజు 4 కరివేపాకు ఆకులను తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కంటి చూపు మెరుగు పరచడంలో, మెదడుని ఉత్తేజితం చేయడంలో, జ్ఞాపక శక్తి ని పెంచడంలో కరివేపాకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పిల్లల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చి వారి పెరుగుదలకు సహాయపడుతుంది.