పాలలో వెల్లుల్లి ఉడికించి తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు     2018-04-19   00:27:41  IST  Lakshmi P

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ లక్షణాలు ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. అయితే ఒక గ్లాస్ పాలలో దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసి ఉడికించి త్రాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పాలలో వెల్లుల్లిని వేసి ఉడికించటం వలన మన శరీరానికి అవసరమైన ఫ్లేవ‌నాయిడ్స్, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌భిస్తాయి. విట‌మిన్ ఎ, బి1, బి2, బి6, సి విట‌మిన్‌, పొటాషియం, ప్రోటీన్లు, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, జింక్‌, సెలీనియం, కాల్షియం అన్ని సమృద్ధిగా అందుతాయి. ఈ పోషకాలు అన్ని మన శరీరానికి అవసరమే.