హరితేజ – ఆదర్శ్ కలిసి ఆ పని చేయబోతున్నారు అంట  

చూస్తుండగానే బిగ్ బాస్ చివరి రోజుల్లోకి వచ్చేసాం. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేపే. ఈ 70 రోజుల్లో 16 మందిలో ( వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కలుపుకొని) తమకు నచ్చిన 5 మందినే ఫినాలేలో సెలెక్ట్ చేసుకున్నారు. అందరు పాపులర్ అయిపోయారు, అందులో ఈ 5 మంది ఇంకా పాపులర్ అయిపోయారు. వారే హరితేజ, నవదీప్, ఆదర్శ్, శివ బాలాజీ మరియు అర్చన. ఈ అయిదుగురిలో బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ చర్చ. ఎక్కడ చూసిన అదే చర్చ. ఎవరు గెలుస్తారో మనకు కూడా తెలియదు. బిగ్ బాస్ ఇంటిని వీడిన తరువాత మిగితా వారు ఏం చేస్తారో తెలియదు కాని, హరితేజ – ఆదర్శ్ ల కోసం ఓ ఆఫర్ ఎదురుచూస్తోంది అని బలమైన టాక్ నడుస్తోంది.

త్వరలోనే అదే స్టార్ మా ఛానెల్ లో “నీతోనే డ్యాన్స్” అనే కొత్త డ్యాన్స్ ప్రోగ్రాం మొదలు కాబోతోందన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ప్రధాన ఆకర్షణగా, జడ్జీగా వ్యవహరించనున్న ఈ షోకి మిగితా జడ్జీలుగా హీరోయిన్ అదా శర్మ, జాని మాస్టర్ వ్యవహరిస్తారట. ఉదయ భాను యాంకర్ గా ఈ షోని హోస్ట్ చేయనుంది. ఇక్కడ ఆసకికరమైన విషయం ఏమిటంటే, ఈ షోలో జోడిగా ఆదర్శ్ మరియు హరితేజ కనిపించనున్నారట. వీరిద్దరూ బిగ్ బాస్ ద్వారా బుల్లితెరపై మంచి స్టార్ డం సంపాదించారు. కాబట్టి వీరిద్దరూ కనిపిస్తే షోకి మంచి పాపులారిటి వస్తుందని ఛానెల్ యాజమాన్యం భావిస్తోందట.

ఇక బిగ్ బాస్ ఫినాలే గురించి మాట్లాడుకుంటే, రేపు 6 గంటల నుంచి 10 గంటల దాకా టెలికాస్ట్ కానుంది. ఇక ఒక సర్ ప్రైజ్ విషయం ఏమిటంటే, దేవీశ్రీప్రసాద్ స్టేజి మీద స్పెషల్ షో చేయనున్నాడట. ఇక మీరే అర్థం చేసుకోండి, ఫినాలే ని ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేసారో.