తెలంగాణలో ఫ్యూచర్ సీఎంగా..ఎవరు బెస్ట్ అంటే..?     2018-03-07   00:38:34  IST  Bhanu C

Harish rao, KTR who is best for Telangana “CM”..?

ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో కేసీఆర్ ని మించిన వ్యక్తి తెలంగాణలో లేరని అంటారు..తెలంగాణా రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పగల వ్యక్తి కేసీఆర్ గత కొన్ని రోజులుగా కేసీఆర్ మోడీని,కేంద్రాన్ని టార్గెట్ గా చేస్తూవస్తున్నా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి..ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలు ఏమి చేయలేదు..వాటి వల్ల దేశానికి జరిగిన అభివృద్ధి ఏమిలేదు అంటూ బిజెపి ,కాంగ్రెస్ లపై ఫైర్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే..అయితే థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడిన కేసీఆర్ ప్రధానిని కావాలనే కోరికను బయటపెట్టడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచీ మొదలు జాతీయ రాజకీయాలలో తీవ్ర చర్చలకి దారి తీస్తున్నాయి..అయితే ఇక్కడే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటపడుతున్నాయి.

కేసీఆర్ కి జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల సత్తా నిజంగానే ఉందా..? చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ విషయంలో ఆసక్తి కనబరచటం లేదు ఈ సమయంలో కేసీఆర్ ఒక్కడే థర్డ్ ఫ్రంట్ ని ముందుకు నడిపించగలడా అంటే అంత సీన్ లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అయితే కేసీఆర్ ఆడే థర్డ్ ఫ్రంట్ నాటకం అంతా కూడా కేటిఆర్ ని సీఎం గా గద్దెనెక్కించడం కోసమే అంటున్నారు..తానూ ఎంపీగా పోటీ చేస్తూ రాష్ట్ర రాజకీయాల నుంచీ తప్పుకుంటూ సీఎం గా కొడుకు కేటిఆర్ ని కుర్చోబెట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి..అయితే ఇప్పుడు తెలంగాణలో మరో హాట్ టాపిక్ వైరల్ అవుతోంది..ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న బలమైన టీఆర్ఎస్ కేడర్ ని మరియు ప్రత్యర్ధి పార్టీల ని ఎదుర్కోగల సత్తా కానీ తెలివైన రాజకీయాలు చేయగల సత్తా కేటిఆర్ కి ఉందా లేదా అందరికీ అజాత శత్రువులా ఉంటూ ఎంతో అనుభవం ఉన్న హరీష్ రావు కి ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.