మ్యాచ్ ఓడిపోతనేం మనసులు గెలుచుకున్న హార్ధిక్..  

అటు బౌలింగ్లోనూ ,ఇటు బ్యాటింగ్లోనూ తన సత్తా చాటుతూ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన క్రికెటర్ హార్ధిక్ పాండ్యా..ఇంగ్లాండ్ లో జరుగుతున్న తొలి టెస్టులో విఫలమైనా.. తన మంచితనంతో ప్రశంసలు పొందుతూ,మనసులు గెలుచుకున్నాడు.సాటి మనిషికి సాయం చేయాలంటే గొప్పగొప్ప కార్యక్రమాలు చేయక్కర్లేదు..మనం చేసే చిన్న సాయం ఎదుటి మనిషిని సంతోషపెట్టగలిగితే చాలు అని నిరూపించాడు పాండ్యా.ఇంతకీ పాండ్యా ఏం చేశాడో తెలుసా..

బర్మింగ్‌హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.. మ్యాచ్‌ అయిపోయిన తర్వాత ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో కలిసి హోటల్‌కి వెళ్లిన హార్దిక్ పాండ్య తనతో పాటు ఓ కవర్‌ని లోపలికి తీసుకెళ్లాడు. మిగిలిన ఇద్దరు క్రికెటర్లు తమ గదికి వెళ్లిపోయారు. హార్దిక్ పాండ్య మాత్రం ఆ కవర్‌ని నేరుగా తీసుకెళ్లి హోటల్ సిబ్బందికి అందజేశాడు.

‘ఈ కవర్‌లో ఒకరికి సరిపడ భోజనం ఉంది. ఎవరైనా.. ఆకలితో భోజనం కోసం మీ హోటల్‌ దగ్గరికి వస్తే ఈ కవర్‌ని అందజేయండి,మేం ఈ భోజనాన్ని తాకలేదు’ అని సిబ్బందికి చెప్పి అక్కడినుండి తన రూంకి వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్‌లో రాత్రి పూట భోజనం కోసం హోటల్‌ దగ్గరికి వ్యక్తులు రావడాన్ని గమనించే హార్దిక్ అలా కవర్‌ని సిబ్బందికి ఇచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంతో హార్ధిక్ ని అందరూ ప్రశంసిస్తున్నారు.