దుబాయ్ లో భారత సంతతి యువకుడిపై కేసు  

భారత సంతతికి చెందినా యువకుడు ఒక బాలికని తాకాడని ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని అందిన ఫిర్యాదుకి అక్కడి పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు..అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు..తాజాగా జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలలలం సృష్టిస్తోంది..వివరాలలోకి వెళ్తే..

భారత్ కి చెందిన 24 ఏళ్ల యువకుడు దుబాయ్‌లో ఒక సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నాడు..అదే సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న పనిచేస్తున్న 13 ఏళ్ల బాలిక తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాలికని చెప్పుకొని చోట్ల తాకుతూ లైంఘిక దాడి చేశాడని..అంతేకాదు ఆమెని ఎవరూ లేకుండా చూసి కౌగిలించుకున్నాడని..దాంతో కంగారు పడిన బాలిక ఈ విషయాన్ని బయటకియా చెప్పడంతో అక్కడి నుంచీ అతడు పారిపోయాడని పోలీసులకి బాలిక తలి ఫిర్యాదు చేసింది..

అయితే బాలిక చేసిన ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు నిందితుడు పై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసుపై దుబాయ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని ఉద్దేశ పూర్వకంగా ఆమెని తాకలేదని పొరపాటున ఆమెని తాకానని చెప్పాడు.బాలిక ఈ విషయం చెప్పగానే ఆమె తల్లి ఈ విషయాన్ని పోలీసులకి చెప్పడంతో వారు సీసీ టీవీ పుటేజ్ ని పరిశీలించారు…ఈ కేసుపై మరింత విచారణం చేసి కోర్టు ముందు ప్రవేశ పెడుతామని తెలిపారు పోలీసులు