Half Yearly Report : Hits and flops at Telugu boxoffice

చూస్తుండగానే ఏడాదిలో సగభాగం గడిచిపోయింది. ఈ అర్థవార్షికంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీ గా నిలిచింది తెలుగు సినిమా. ఓవైపు బాలివుడ్ కష్టాలను చూస్తోంటే, తెలుగు మార్కెట్ మాత్రం పెరిగిపోతుంది. ఈ ఏడాది టాప్ 10 ఓపెనింగ్స్ లో 5 తెలుగు సినిమాలే ఉన్నాయి.. బాహుబలి ది కంక్లుజన్, ఖైది నంబర్ 150 ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాప్ 2 ఓపెనింగ్స్ ఇండియాలో. ఇక కేవలం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అర్థవార్షికాంలో 8 హిట్ సినిమాలు వచ్చాయి. చూడండి మీరే ఏ సినిమా రిజల్ట్ ఏమిటో.

బ్లాక్ బస్టర్స్ :

బాహుబలి ది కంక్లుజన్ … షేర్ కలెక్షన్ల పరంగా భారతదేశ సినిచరిత్రలో అతిపెద్ద హిట్. గ్రాస్ పరంగా కేవలం దంగల్ వెనకాలే ఉంది. 500 కోట్లకు పైగా లాభాలను పంపిణిదారులకి అందించిన బాహుబలి బ్లాక్ బస్టర్ కేటగిరిలోకి వస్తుంది.

శతమానంభవతి. పెట్టిన దానికి రెండింతలు సంపాదించిన సినిమా. 30 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు. కొన్నవారందరికి భారి లాభాలు. ఇది కూడా బ్లాక్ బస్టర్.

ఈ ఏడాది మూడోవ బ్లాక్ బస్టర్ నేను లోకల్. మూడింట్లో రెండు దిల్ రాజువే కావడం విశేషం. ఇది కూడా 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.