హెచ్ -1 బీ ఎఫెక్ట్ ..భారత ఐటీ కి భారీ దెబ్బ  

అమెరికా ప్రభుత్వ ట్రంప్ విధానాల వలన హెచ్ -1 బీ వీసా నిభందనలు ఎంతో కటినతరం అయ్యాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నిభంధాలని ఖటినతరం చేసిన తరువాత దాని ప్రభావం భారత ఐటి కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపడమే కాకుండా భారత ఐటీ కంపెనీ మార్జిన్ల పై కూడా ప్రభావం చూపింది..ఇదే విషయాన్ని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది…అమెరికా కొత్త నిభంధనల్ని పాటించడం అమెరికాలో స్థానికులకి ప్రయారిటీ ఇవ్వడం వలన ఈ పరిణామాలని ఎదుర్కోక తప్పదని తెలిపింది.?

హెచ్‌-1బి వీసాలపై కంపెనీలు ఎంత మేరకు ఆధారపడుతున్నాయో ఆ మేరకు ప్రభావం ఉంటుందని అయితే నిభంధనల్లో మార్పులతో ప్రస్తుతం హెచ్‌-1బి వీసాలకు అర్హమైన కొన్ని స్థాయిలు అర్హతను కోల్పోయే అవకాశం ఉందని..దాని ఫలితంగా దీని మూలంగా భారత్‌ నుంచి నియామకాలు తగ్గే ఆస్కారం ఉన్నట్టు ఇక్రా కార్పొరేట్‌ సెక్టార్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ జైన్‌ తెలిపారు…అంతేకాదు తాజాగా ట్రంప్ ఈ వీసా విధానం పై మాట్లాడుతూ మేము అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులని మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాము అని తెలిపాడు..