200 మంది పిల్లలు ఆత్మాహుతి కి సిద్దం - డేరా అనుచరులు

గుర్మిత్ సింగ్ అలియాస్ డేరా బాబా తన అస్రమంలో ఉండే ఇద్దరు సాధ్వీల మీద అత్యాచారం చేసిన విషయంలో ఎన్నో ఏళ్ల తరువాత ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్న విషయం తెలిసిందే..అయితే డేరా అరెస్ట్ అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒక్కో విషయం బయటకి వస్తున్నాయి..అవి కూడా సంచలనం కలిగించే అంశాలు కావడం విశేషం.

డేరా బాబా అక్రమాలు అతగాడు చేసిన దారుణాలు మీడియాలో సీరియల్ గా వస్తున్న వైనంపై ఆయన శిష్యులు మండిపడుతున్నారు. డేరా సచ్చా సౌధా అనుబంధ సంస్థ కుర్బానీ లీగ్ చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. డేరా బాబా మీద వ్యాఖ్యలు చేస్తున్న పోలీసులు.. జర్నలిస్టులు.. మాజీ అనుచరులు ఎవరైనా సరే.. గుర్మీత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వారందరిని ఏసేస్తామంటూ చేస్తున్న వార్నింగ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే వీటిమీద కొంతమందికి హెచ్చరిక లేకలు అందినట్టు సమాచారం.