“రాయపాటి సవాల్”..కన్నా ఓటమే “నా లక్ష్యం”     2018-05-17   05:03:30  IST  Bhanu C

రాయపాటి ఈ పేరుని పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయే నేతగా రాజకీయ కురువృద్దుడిగా పేరున్న ఆయన కొంతకాలం క్రితం రాజకీయాలకి సెలవు ప్రకటిస్తున్నానని తెలిపిన విషయం విధింతమే అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు..మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు అయితే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం లేకపోలేదు అంటున్నారు ఆయన అనుచరులు..అసలు విషయం ఏమిటంటే..

రాయపాటి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో బద్దవైరం ఉండేది. పరస్పరం విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు..దాంతో వారు ఇరువురు పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు. అయితే పదేళ్ళ కన్నా గుంటూరులో తన ప్రాభల్యం అలాగే కోసనాగేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతూనే వచ్చారు అయితే 2014 ఎన్నికలు మాత్రం కన్నా రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెట్టాయి.