గడపకు పసుపు కుంకుమ ఇలా పెడితే పట్టిందల్లా బంగారమే..!    2018-04-10   00:26:53  IST  Raghu V

మన హిందూ సాంప్రదాయంలో గడపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గడప అంటే లక్ష్మిదేవితో సమానము. అందువల్ల లక్ష్మిదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్టు పెడతారు. గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి. అది ఇల్లు అయినా దేవాలయం అయినా గడపను దాటి మాత్రమే వెళ్ళాలి. ఇంటి గడపకు వారానికి ఒకసారైనా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.


అలాగే పర్వ దినాల్లో కూడా చేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మి దేవి ఇంటిలో ఉండటమే కాకుండా దుష్ట శక్తులు అన్ని పోతాయి. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నల్లని తాడుతో పటిక కడితే నర దిష్టి తొలగిపోతుంది. అన్ని రకాల దిష్టిలలో నర దిష్టి చాలా పవర్ ఫుల్. నర దిష్టికి రాళ్ళూ కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది.