GST is Rahul gandhi 2019 election strategy

ప్రతీమనిషికి అదృష్టం ఒక్కసారి వస్తుంది.. అప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు.. నిజమే రాహుల్ విషయంలో ఇది నిజం అవ్వనుంది అంటున్నారు విశ్లేషకులు. బిజేపి అధికారం లోకి రావడం మోడీ ప్రధానమంత్రి అవ్వడం..ప్రపంచ పర్యటన చేస్తూ భారత్ పేరు ప్రపంచంలో అందరికీ తెలిసేలా చేసి పెట్టుబడులకి ఊపు తీసుకువచ్చిన ఒకే ఒక వ్యక్తీ మోడీ..ఒక్క సారిగా తానూ సంపాదించిన ఘన కీర్తి ఒక్కసారిగా నోట్ల రద్దు, GST వాళ్ళ పటాపంచలు అయ్యింది. అంతేకాదు మోడీ సర్కార్ కాంగ్రెస్ గెలుపుకి GST బాట వేసింది అని కూడా అంటున్నారు విశ్లేషకులు.

రాహుల్ ఈ మధ్య మోడీని బాగానే టార్గెట్ చేస్తున్నారు..మనం “డీ” ఒక వ్యక్తితో తలపడాలి అంటే అందుకు తగ్గట్టుగా రాటుదేలాలి ఇప్పుడు రాహుల్ అదే చేస్తున్నారు..ఇదే విషయాన్ని ఆయన కూడా గుర్తించినట్లున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆయనకు కంటెంట్ రాసే వ్యక్తి.. ఆయనకు సూచనలు చేసే మెంటార్ మారినట్లుగా కనిపిస్తోంది. రాహుల్ మాటల్లో కానీ చేతల్లో కాని..హావభావాలు పలికించడంలో చాలా మార్పు చోటుచేసుకుంది..