గ్రాస్, షేర్, నెట్ .. ఈ తేడాలేంటి? సినిమా బిజినెస్ పూర్తి వివరాలు

ఒకప్పుడు సినిమా ఎన్నిరోజులు ఆడింది? ఎన్ని సెంటర్లలో 50,100 రోజులు జరుపుకుంది .. ఈ అంశాల మీద సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసేవారు. కాని ఇప్పుడు అలా కాదు.. సినిమా కలెక్షన్లని ట్రాకింగ్ చేయడం సులువైన పనిగా మారింది. ప్రతీ సినిమా యొక్క కలెక్షన్ల రిపోర్టు బయటకి వస్తోంది. లెక్కల విషయంలో నిర్మాతలు అవకతవకలకి పాల్పడినా తెలిసిపోతుంది. ట్రాకింగ్ వ్యవస్థ అంత బలంగా మారింది మరి. కాని, ఇప్పటికీ సినిమా కలెక్షన్ల మీద పూర్తి అవగాహన ఉండట్లేదు జనాలకి. సినిమా నిర్మాతలు వందకోట్లు వచ్చాయి అని ప్రకటిస్తే, గ్రాస్, నెట్, షేర్ కి మధ్య తేడా తెలీకుండా, ఒక సినిమా ఎంత సంపాదించింది అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ తేడా తెలియకే, ఒక్కోసారి తెలుగుస్టాప్ రిపోర్టు చేస్తున్న కలెక్షన్లని కూడా సింపుల్ గా ఫేక్ అనేస్తున్నారు. ఈ యుగంలో కూడా సినిమా బిజినెస్ మీద అవగాహన లేకపోతే ఎలా? అందుకే సినిమా బిజినెస్ కి సంబంధించి అయిదు ముఖ్యమైన విషయాల్ని మీకు చెబుతున్నాం .. షేర్, గ్రాస్, నెట్ మధ్య తేడా మీకు చెబుతున్నాం .. పేజిలు తిప్పుతూ బాక్సాఫీస్ లెక్కల మీద జ్ఞానాన్ని పెంచుకోండి.