పచ్చి బఠాణీ తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు     2018-06-25   23:14:45  IST  Lakshmi P

పచ్చి బఠాణి మంచి రంగు,రుచిని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా కూరల్లో వేసుకుంటూ ఉంటాం. కూరల్లో వేసుకుంటే కొరకు మంచి రుచి వస్తుంది. అంతేకాక ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. పచ్చి బఠాణిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.

పచ్చి బఠాణిలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన పిండి పదార్ధాలను చాలా సులభంగా జీర్ణం చేస్తాయి. దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉండటం వలన మధుమేహం ఉన్నవారికి పహ్హ్య్ బఠాణి మంచి ఆహారం అని చెప్పవచ్చు.

పచ్చి బఠాణిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి జీర్ణ క్రియ బాగా జరిగేలా ప్రోత్సాహం ఇస్తుంది.

పచ్చి బఠాణిలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. పిండం ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన పుట్టబోయే బిడ్డకు ఎటువంతో పోషకాహార లోపం ఉండదు.