Govt defends the section allowing forced $ex with minor wife

ఆ ఎన్జీవో వేసిన పిటిషన్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు పెళ్ళికి అర్హులు కారు, అలాంటిది ఒక మైనర్ అమ్మాయితో, పెళ్ళి చేసుకున్న మగాడు, తనకి ఇష్టం లేకున్నా శృంగారం చేయడాన్ని తప్పుపట్టకపోవడం అంటే, బాల్య వివాహాల్ని ఎంకరేజ్ చేసినట్లే, మొదటగా మైనర్ ని పెళ్ళి చేసుకున్నందుకు, ఆ తరువాత తన అనుమతి లేకుండా శృంగారం చేసినందుకు, రెండు కారణాలతో అలాంటి భర్తలని శిక్షించాలని, పెళ్ళి చేసుకున్నంత మాత్రానా రేప్ చేసే హక్కు లేదని ఎన్జీవో వారు పేర్కొన్నారు.

అయితే ప్రభుత్వం వారి వెర్షన్ ఇంకోలా ఉంది. పెళ్ళిలో ప్రతి విషయానికి లీగల్ గా ఆలోచించలేమని, అంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని, అలాగే ఆ అమ్మాయిల పెళ్ళితో పాటు జీవితం దుర్భరం అవుతాయని, వాస్తవంలోకి వస్తే, దేశంలో 23 మిలియన్ల మైనర్ అమ్మాయిలు పెళ్ళి చేసుకొని ఉంటారు, మధ్యలో పెళ్ళి చెడిపోతే వారి జీవితం కష్టమైపోతుంది అని ప్రభుత్వం ఆ సెక్షన్ ని విజయవంతంగా డిఫెండ్ చేయగలిగింది.