Govt defends the section allowing forced $ex with minor wife

ఇద్దరు పెళ్ళి చేసుకున్న భాగస్వాములు శృంగారం చేసుకుంటే అందులో లీగల్ గా కాని, మోరల్ గా కాని ఎలాంటి తప్పు లేదు. ఇద్దరు మేజర్లు పెళ్ళికాకుండానే శారీరక సంబంధం పెట్టుకుంటే అది మోరల్ గా తప్పు కావచ్చు ఏమో కాని లీగల్ గా తప్పు కాదు. మరి పెళ్ళి జరిగిన దంపతులలో భార్యకి శృంగారం ఇష్టం లేకపోయినా భర్త శృంగారం చేస్తే ? దాన్ని రేప్ కింద పరిగణించాలా ? ఒకరికి సమ్మతి లేని శృంగారాన్ని మానభంగం కిందే జమకట్టాలా ? కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలల ఎన్నో న్యాయస్థానాలకి అంతుచిక్కని ప్రశ్నగా మారింది ఇది. అందులోనూ ఇలాంటి సందర్భాల్లో భార్య మైనర్ అయితే ? కనీసం అప్పుడైనా దాన్ని రేప్ కింద పరిగణించి “మేరిటియల్ రేప్” కేసు వేయాలా ? సూప్రీమ్ కోర్టులో ఈ విషయంపై వాడివేడి చర్చ జరిగింది.

ఇండియన్ పినల్ కోడ్ 375 (2) లో రేప్ కేసుల్లో ఓ చిన్న సడలింపు ఉంది. అదేమిటంటే పెళ్ళి చేసుకున్న భర్త, తన భార్య మైనర్ అయినా, తనకి ఇష్టం లేని శృంగారం చేసినా, దాన్ని రేప్ కింద పరిగణించడం జరగదు. దీన్ని ఒక లూప్ హోల్ గా చూపిస్తూ ఒక NGO సుప్రీంకోర్టుని దీని సవరించమని అడిగింది. దాంతో ఈ సెక్షన్ మీద న్యాయస్థానానికి, గవర్నమెంటుకి చర్చ మొదలైంది.