Goutham Nanda Movie Review

చిత్రం : గౌతమ్ నంద
బ్యానర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా
దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత : జే. పుల్లారావు
సంగీతం : తమన్
విడుదల తేది : జులై 28\, 2017
నటీనటులు : గోపీచంద్, హన్సిక, కాథరిన్ త్రేసా, ముకేష్ రుషి తదితరులు

యాక్షన్ స్టార్ గోపీచంద్ సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా, తనకున్న ఇమేజ్ చట్రంలోనే మాస్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ట్రెండ్ మారిన దగ్గరినుండి గోపీచంద్ కి లభించిన ఒకే ఒక్క విజయం లౌక్యం. కాని ఆ సినిమా తరువాత కూడా మళ్ళీ డిలాపడ్డాడు ఈ మాస్ హీరో. మరోవైపు మాస్ సినిమాలకు పెట్టింది పేరు సంపత్ నంది. మరి ఇద్దరు కలిసి జపించిన మాస్ మంత్రం “గౌతమ్ నంద” ఎలా ఉందొ చూడండి.

కథలోకి వెళితే :

ఫోర్బ్స్ టాప్ 50 ధనువంతుల్లో ఒకడైన ఓ బడా బాబు కొడుకు (గౌతమ్). డబ్బులో మునిగి తెలుతుంటాడు. కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకునే ముందు ప్రపంచాన్ని చుట్టి వద్దామనుకున్నా, గౌతమ్, ఓ సంఘటన తరువాత డబ్బుకి మించిన భావోద్వేగాలు, జీవితం కావాలనుకుంటాడు.

కథలో మరోవైపు నంద (గోపీచంద్) బోరబండాలోని ఓ నిరుపేద మరియు నిరుద్యోగి. గౌతమ్ కి డబ్బు లేని భావోద్వేగాలు కావాలి, నందకి కష్టాలు లేని జీవితం, డబ్బు కావాలి. దాంతో ఈ ఇద్దరు ఒకరి స్థానంలో మరొకరు ఓ 30 రోజులు ఉండాలని డిసైడ్ చేసుకుంటారు. ఆ తరువాత కథలో జరిగే మార్పులు ఏమిటో తెర మీదే చూడండి.