వైసీపీ అభిమానులకి గుడ్ న్యూస్..     2018-04-11   07:46:12  IST  Bhanu C

ఇది నిజంగానే జగన్ మోహన్ రెడ్డి అభిమానులకి శుభవార్త అనే చెప్పాలి..ఎందుకంటే అక్రమంగా జగన్ పై దాదాపు 11 కేసులు పెట్టి జైలుకి పంపించి ఎన్నో ఇబ్బందులకి గురిచేసి రాక్షస ఆనందం పొందారు..అయితే ఈ కేసుల వ్యవహారాల వెనుక టిడిపి హస్తం కూడా ఉంది అనేది వైసీపి వర్గాలు ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాయి..అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ అల్లుకుని ఉన్న కేసుల వలయంలో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పొర విడిపోతూ వస్తున్నాయి.

Good News for YS Jagan Fans


జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ పెట్టిన కేసులకి తగిన ఆధారాలు లేవని అంటూనే..సీబీఐ ఆధారాలు సేకరించడంలో విఫలం అవుతోందని కోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ పై పెట్టిన కేసులు అన్ని తప్పుడు కేసులే అని తేటతెల్లం అవుతోంది..జగన్ తో సహా అభియోగాలు ఎదుర్కుంటున్న ఐఏఎస్ అధికార్లకు క్లీన్ చిట్ దక్కుతోంది…ఈ క్రమంలోనే తాజాగా లేపాక్షి హబ్ భూముల కేటాయింపునకు సంబంధించి అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డికి తాజాగా హైకోర్టులో ఊరట లభించడం ఇందుకు నిదర్శనం