Going to gym stops your height growth ?

మీ ఇంటి ముందు ఒక టీనేజ్ లో ఉన్న కుర్రాడిని అడగండి, జిమ్ కి వస్తావా అని. మా అనుమానం కరెక్ట్ అయితే, ఇప్పుడే రాను, ఇంకా ఎత్తు పెరగాల్సి ఉంటుంది, మరో రెండు మూడేళ్ళ వరకు జిమ్ జోలికి వెళ్ళను అని అంటాడు. జిమ్ కి వెళితే బరువులు బాగా ఎత్తాల్సి వస్తుంది కాబట్టి, ఆ బరువు వలన ఎముకలపైన ఒత్తిడి బాగా ఏర్పడి మనిషి ఎత్తు పెరగడం ఆగిపోతారని చెబుతారు జనాలు. మరి వారు చెప్పేది నిజమేనా ? బరువు ఎత్తడం వలన పిల్లలు ఎక్కువ ఎత్తు పెరగరా ? ఎత్తు అక్కడికే ఆగిపోతుందా ?

నిజానికి అలాంటిది ఏమి జరగదు. ఎలాగైతే, వీర్యం రక్తంతో తయారవుతుందని చెబుతారో .. ఇది అంతే. ఒక పెద్ద అపోహా. ఎలా, ఎందుకు మొదలైందో కాని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. బరువు ఎత్తడం వలన మనిషి ఎత్తు ఆగిపోదు. మనిషి ఎత్తు అనేది జీన్స్ మీద, తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది తప్ప, జిమ్ కి వెళ్లి బరువు ఎత్తడం, కండలు పెంచడం వలన ఆగిపోదు, తగ్గిపోదు.

మన వయసు పెరుగుతున్నకొద్ది మన ఎముకలు పెరుగుతూ ఉంటాయి. మన ఎముకల చివర ఎపిఫిజల్ ప్లేట్స్ ఉంటాయి. అవి మనం పెరుగుతున్న కొద్ది తమ రూపుని మార్చుకుంటూ మనం ఎత్తు పెరిగేందుకు సహాయపడతాయి. ఓ వయసుకి వచ్చాక, ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. అప్పుడే మన శరీరం ఇంకా ఎత్తు పెరగడం ఆపేస్తుంది. అది 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో జరగోచ్చు. ఒక్కసారి మనం ఆ స్టేజికి వచ్చాం అంటే మన ఎపిఫిజల్ ప్లేట్స్ ఇక అలాగే ఉండిపోతాయి. అంతే, మన శరీరం ఇక అక్కడినుంచి పెరగదు.

టీనేజ్ లో మన శరీరం ఇంకా లేతగానే ఉండటం వలన, పిల్లలు బరువులు ఎత్తకూడదు అని అనుకోని, ఈ అపోహ పుట్టించి ఉంటారు. అంతేతప్ప ఇందులో నిజం లేదు. జిమ్ కి వెళ్ళడానికి, ఎత్తు తగ్గడానికి లేదా ఎత్తు ఆగడానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా నమ్మకంగా లేకపోతే క్రీడాకారులనే ఉదాహరణగా తీసుకోండి. మన క్రికెట్ ఆటగాళ్ళు చిన్నతనంలోనే బ్యాట్ పట్టుకున్నారు. ఫిట్ నెస్ కోసం టీనేజ్ నుంచే జిమ్ కి వెళుతున్నారు .. అయినా అందరు పొట్టిగా లేరే ? ఇషాంత్ శర్మకి అంత ఎత్తు తన జీన్స్ వలన, తను తిన్న పౌష్ఠిక ఆహరం వలన వచ్చింది. అంతేతప్ప ఆతను జిమ్ కి వెళ్ళకుండా తనని తాను ఆపుకోలేదు. తానే గనుక జిమ్ కి వెళ్ళకుండా ఉండుంటే, ఇంత బలంగా ఉండేవాడా ? అంత వేగంగా బంతులు విసిరేవాడా ?