Girls would easily reject these type of guys

అమ్మాయిల సైకాలజి మగవారికి అందడం చాలా కష్టం. కొంచెం అందంగా ఉన్నా సరే, అమ్మాయిలకి చాలామంది ప్రపోజ్ చేస్తారు. అంతమందిలో వారు ఒకరిని ఓకే చేశారంటే ఎందుకు ఓకే చేసినట్టు కరెక్టుగా కనిపెట్టడం తేలికైన పనేం కాదు. కాని ఒక అబ్బాయిని ఓకే చేయలేదు అంటే మాత్రం దానివెనుక కొన్ని కారణాలు ఉండవచ్చు. ఆ కారణాల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం.

* నా జీతం ఇంత, నా లెవెల్ ఇంత, అంటూ అమ్మాయి తనకి పడకపోతే అమ్మయే చాలా కోల్పోయినట్లు భావించే అబ్బాయిలకి అమ్మాయి పడటం చాలా కష్టం. ఇలాంటి అబ్బాయిలకి సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ కాబట్టి, భవిష్యత్తులో డామినేట్ చేస్తాడేమో అని అనుమానపడతారు.

* తన ప్రేమికుడు/భర్త తనతో ఉంటే చాలు అని అనుకునే అమ్మయిలు ఉంటారు. ఇలాంటివారు ప్రపంచం పెద్దగా ఉండే అబ్బాయిలని పట్టించుకోరు. స్నేహితులు, పరిచయలు, పేరు ఎక్కువ ఉండే అబ్బాయిలు తమని వదిలేస్తారేమో అనే భయం ఉంటుంది కొందరికి.

* అతి వినయం, అతి బిడియం ప్రదర్శించే అబ్బాయిలంటే అమ్మాయిలకి చిరాకు. ఇలాంటివారు వైపు కన్నెత్తి కూడా చూడకపోవచ్చు.

* ముభావంగా ఉండేవారు, తక్కువగా నవ్వేవారు, ఇంట్రోవర్ట్స్ పై కూడా అమ్మాయి మనసు వెళ్ళడం కష్టం.

* ఫన్నిగా ఉన్నా, మరో విచిత్రమైన కారణం ఏమింటంటే, చాలావరకు అమ్మాయిలు తమ వెంటే అబ్బాయిలకన్నా, తమకు కాస్త దూరంగా ఉండే అబ్బాయిలపై మనసు పారేసుకుంటారు.