ర్యాంకు రాలేదని 9 వ అంతస్తు నుండి దూకి హైదరాబాద్ యువతి ఆత్మహత్య.! నిమిషాల్లోనే అంతా.!     2018-06-05   23:08:04  IST  Raghu V

పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. విద్యా సంస్థల ఒత్తిళ్లు, తల్లిదండ్రులు ఒత్తిల్లు ఇలా వివిధ రకాల కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో విషాదం చోటు చేసుంది. మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు చెబుతున్నారు బంధువులు.వివరాల లోకి వెళ్తే..

మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లింది. అక్కడ్నుంచి కిందకు దూకింది. బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేశారు. దూకొద్దు అని అరిచారు. దూకితే ఎలా రక్షించాలని కొందరు ఆలోచన చేస్తున్నారు.. మరికొందరు పోలీసులకు ఫోన్ చేశారు.. మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.. మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది.