నిలదీసాడని..కత్తితో పొడిచేసింది!!!     2015-02-05   05:18:28  IST  Raghu V

Girl Friend Murdered her Boyfriend

ప్రస్తుత సమాజంలో రిలేషన్-షిప్ అనేది చాలా చీప్ గా మారిపోయింది…మనిషిలోని మృగం బయటపడి..మంచితనాన్ని…మానవత్వాన్ని కభలించేస్తుంది..ఇదిలా ఉంటే..లాంకషైర్ లో జరిగిన ఒక ఉదంతం చూస్తే..మనిషిలోని మానవతా అనే కోణం అనేది నశించింది అనడానికి ఈ ఉదంతమే సాక్ష్యం అనేలా కనిపిస్తుంది….విషయం ఏమిటంటే….19 ఏళ్ల ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌ను కత్తితో పొడిచింది. తాను వేసుకున్న దుస్తులు తదితర విషయమై వారి మధ్య వాగ్వాదం జరగగా..ఈ సమయంలో ఆమె ఓ కత్తితో బాయ్ ఫ్రెండ్‌ను పొడిచి చంపింది. పందొమ్మిదేళ్ల యువతి సారా విల్లిస్ ముస్లీం మతంలోకి మారింది. ఆమెకు బిలాల్ సిద్దిఖీ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే బిలాల్ సిద్దిఖీ ముస్లీం పద్ధతుల ఆచరణ పట్ల చాలా సీరియస్‌గా ఉంటాడు. ఇదే విషయమై..ఓ దశలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. సారా విల్లిస్ వేసుకుంటున్న టైట్ దుస్తులు, షార్ట్ దుస్తుల పైన ప్రియుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఓ సమయంలో ఆమెను మరో యువకుడితో చూశాడు. ఈ సంఘటనలు సిద్ధికి ఏమాత్రం రుచించలేదు. దీంతో తనను చీటింగ్ చేస్తోందని సిద్ధిఖి అనుమానించాడు. ఆమెను నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో సారా విల్లిస్ పక్కనే ఉన్న ఓ చాకును తీసుకొని బిలాల్‌ను పొడిచింది. అతనికి తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ గంట తర్వాత మృతి చెందాడు. సారా విల్లిస్ పైన హత్య కేసు నమోదు చేసి కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు.