గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో!!!     2015-02-05   01:13:56  IST  Bhanu C

GHMC Elections Soon??

తాజాగా ఏర్పడ్డ సరికొత్త..రాష్ట్రం…సరికొత్త ప్రభుత్వం ఇప్పుడు అనుకోని చిక్కుల్లో పడింది…సార్వత్రిక ఎన్నికల్లో ఏదో రకంగా గట్టెక్కేసిన గులాబీ పార్టీ..ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు అన్న పదం వింటేనే జ్వరంతో వణికి పోతుంది..దానికి అనేక కారణాలు ఉన్నాయి…ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ టీఆరఎస్ పార్టీకి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో పెద్దగా బలం లేదు అనేది గత ఎన్నికల్లో స్పష్టమయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అని కేసీఆర్ అండ్ కో భావించి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే హై కోర్ట్ చీవాట్లు పెట్టడంతో అలెర్ట్ అయిన టీ సర్కార్.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించాలి అని తెలుస్తుంది.. ఇక ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరపడం ఆషామాషీ కాదంటోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇంకా బీసీల సర్వే పూర్తి చేయాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉత్తర్వులిచ్చినా ఎన్నికల ప్రాసెస్ పూర్తయ్యేలోగా ఆరునెలలు టైం పడుతుందని చెబుతున్నారు. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎన్నికలు జరపాలని పట్టుబడుతున్నయి. డీలిమిటేషన్ పేరుతో గ్రేటర్ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడుతున్నాయి. మరి ఏమీ జరుగుతుందో వెయిట్ అండ్ సీ.