ఆనం- గంటా ఏంచేయబోతున్నారు..? టీడీపీలో టెన్షన్     2018-06-25   00:30:23  IST  Bhanu C

ఎన్నికల ఊపుతో ముందుకెళ్తున్న టీడీపీకి మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం మింగుడుపడడంలేదు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందు తన అసమ్మతిని వెళ్లగక్కాడు. అయితే ఆ తరువాత చంద్రబాబు ఎదో చెప్పి ఆయనను బుజ్జగించాడు. అప్పట్లో కొంచెం మొత్తబడినట్టు కనిపించిన గంటా లోలోపల మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సర్వేల పేరు చెప్పి గంటా శ్రీనివాస రావును ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన టీడీపీ అధిష్టానానికి రివర్స్ లో గంటా షాక్ ఇస్తున్నాడు.

టీడీపీ అధినేత ఎంత బుజ్జగించినా గంటా మాత్రం మొత్తబడకుండా తన అజెండా అమలు చేసే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే.. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిరోజులుగా బాబుపై అసంతృప్తితో ఉన్న ఆనం.. తనకు అవమానం జరిగిందని బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పార్టీ ప్రవర్తనతో అసంతృప్తితో రగిలిపోటున్న గంటా కలవడం, కలిసి ఏకాంతంగా చర్చించడంతో వీరి రాజకీయం ఏంటో అర్ధం కావడంలేదు.