జెమినిని సావిత్రి పెళ్లి చేసుకోకుంటే..?     2018-05-24   22:23:55  IST  Raghu V

‘మహానటి’ చిత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా సావిత్రి గురించి మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌, మాస్‌ ఆడియన్స్‌ అనే తేడా లేకుండా మహానటిని విపరీతంగా ఆధరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు అయినా కూడా ప్రతి ఒక్కరు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. మహానటి చిత్రంలో సావిత్రి గురించి ఎన్నో తెలియని విషయాలు వెళ్లడి అయ్యాయి. సావిత్రి చనిపోయిన సమయంలో మీడియా బలంగా లేదు. దాంతో అప్పటి విషయాలు జనాలకు తెలియలేదు.

సావిత్రి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చూపించే ప్రయత్నం చేసి ఆమె జీవితాన్ని కళ్లకు కట్టాడు. చివరి రోజుల్లో ఆమె పడ్డ బాధ, జెమిని గణేషన్‌ గురించిన విషయాలను దర్శకుడు చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. సావిత్రి తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుందని, జెమిని గణేషన్‌ను వివాహం చేసుకోవడం వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందని, అమాయకురాలు అయిన సావిత్రికి లేని తండ్రి ప్రేమను జెమిని చూపించి తన ముగ్గులోకి దించుకున్నాడు. ఒక వేళ సావిత్రి ఆయన్ను వివాహం చేసుకోకుంటే ప్రస్తుత పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉండేదంటూ ప్రచారం జరుగుతుంది.