విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం హిట్టా.? స్టోరీ రివ్యూ రేటింగ్ తెలుగులో....!     2018-08-15   09:30:41  IST  Sainath G

Movie Title : గీత గోవిందం
Cast & Crew:
న‌టీన‌టులు: విజయ్ దేవేరుకోండ , రష్మిక మందాన, నాగేంద్ర బాబు తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: పరశురామ్
నిర్మాత‌: అల్లు అరవింగ్, బన్నీ వాస్ (గీత ఆర్ట్స్ -2 )
సంగీతం: గోపి సుందర్

STORY:

అన్నవరంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. నిత్య మీనన్ కి విజయ్ దేవరకొండ తన లైఫ్ స్టోరీ ని చెప్తూ ఉంటాడు.తన భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నాడో చెప్తాడు . తర్వాత గీత గోవిందం ని కలుస్తుంది. ఇద్దరు కలిసి ఒకే బస్సు లో ప్రయాణం చేస్తారు. లవ్ టిప్స్ ఇచ్చే ఫ్రెండ్ రా రాహుల్ రామకృష్ణ పరిచయం అవుతాడు. గోవిందం ను గీత అపార్ధం చేసుకొని మంచి వాడు కాదు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు అనుకోని దూరం పెడుతుంది. చివరికి గోవిందం మంచితనం గురించి గీతకు ఎలా తెలుస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.

Geetha Govindam Movie Collections,Geetha Govindam Review,Rashmika Mandanna,Vijay Deverakonda

REVIEW:

ప్రస్తుతం తెలుగులో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటన, డైలాగ్ డెలివరీతో విజయ్ యువతకు బాగా దగ్గరైపోయాడు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్‌కు స్టార్‌డమ్ వచ్చి పడింది. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది. దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ లీక్ మూలంగా సినిమాకు బజ్ పెరిగిపోయింది

Geetha Govindam Movie Collections,Geetha Govindam Review,Rashmika Mandanna,Vijay Deverakonda

సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కామెడీ అదరిపోయిందని, విజయ్ దేవరకొండ వన్‌మ్యాన్ షో అని కొనియాడుతున్నారు. విజయ్, రష్మిక కెమెస్ట్రీ బాగా కుదిరిందట. ఒక సాధారణ కథని వీరిద్దరూ హిట్టు బొమ్మగా మార్చేశారని అంటున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది.

Plus points:

విజయ్ దేవరకొండ నటన
రష్మిక గ్లామర్
కామెడీ
మ్యూజిక్

Minus points:

సెకండ్ హాఫ్

Final Verdict:

గీత గోవిందం అటు నిరాశ పరచలేదు. అలాగని ఫుల్ గా వినోదం పండించలేదు.

Rating:

3/5