45 ఏళ్ల వయసులో హీరోగా పరిచయం కాబోతున్న దర్శకుడు  

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేశావే’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు దర్శకత్వం వహించినది గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. ఈయన తెలుగు, తమిళంలో పలు చిత్రాలు తెరకెక్కించి భారీ విజయాలను దక్కించుకున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క మూవీ కూడా క్లాస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మాస్‌ ఆడియన్స్‌ ఆడియన్స్‌కు కూడా నచ్చే విధంగా ఈయన సినిమాలు తీయగలడు. ఈ 45 ఏళ్ల దర్శకుడు త్వరలో హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దమవుతూ తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమల వారికి షాక్‌ ఇస్తున్నాడు.

ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసి, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ త్వరలోనే జై అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. గౌతమ్‌ మీనన్‌కు నటన అంటే ఆసక్తి ఉంది. అందుకే పలు చిత్రాల్లో గెస్ట్‌గా, కొన్ని చిత్రాల్లో కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్రల్లో కూడా నటించాడు. అందుకే గౌతమ్‌ మీనన్‌ తన సినిమాలో నటించాల్సిందిగా జై కోరిన వెంటనే కథ మరియు కథనం విషయాలు ఆలోచించకుండా నటించేందుకు ముందుకు వచ్చేశాడు.

సహజంగా అయితే ఈ వయస్సు వారు ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో హీరోుగా ఉన్నారు. అయితే గౌతమ్‌ మీనన్‌ ఇప్పుడే కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నందు వల్లే సమస్య అంతా అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా గౌతమ్‌ మీనన్‌ నటిస్తే ఎవరు చూస్తారని కొందరు భావిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం తమిళ సినీ పరిశ్రమలో హీరో ఎలా ఉన్నాడు, ఎంత వయస్సు వాడు అనే విషయాలు పట్టించుకోరు. అందుకే ఈయన సక్సెస్‌ అవుతాడనే టాక్‌ వినిపిస్తుంది.

గౌతమ్‌ మీనన్‌ హీరోగా నటించబోతుండటంతో పాటు త్వరలోనే అనుష్క ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఆ చిత్రంలో నటిస్తూనే అనుష్కతో గౌతమ్‌ మీనన్‌ సినిమాను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంలో తెరకెక్కబోతున్న ఆ చిత్రం తెలుగులో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో తెలుగు కోసం కొన్ని ముఖ్య సన్నివేశాలను రీషూట్‌ చేయబోతున్నారు. దర్శకుడిగా సక్సెస్‌ అయిన గౌతమ్‌ మీనన్‌ దర్శకుడిగా సక్సెస్‌లను దక్కించుకుంటాడా అనేది చూడాలి.