గతి తప్పి అతి చేస్తున్న నేతలు ... టీడీపీలో ఇదో టెన్షన్ !     2018-06-30   03:34:29  IST  Bhanu C

క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీలో కనిపించని డిసిప్లేన్ ఆ పార్టీలో కనిపిస్తుంటది. అధిష్టానం మాటే అందరికి శిలాశాసనం. అందుకే ఎన్ని వడిదుడుకులు వచ్చినా పార్టీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అన్నిటిని తట్టుకుని నిలబడుతోంది. అయితే ఆ పరిణామాలు అన్ని ప్రతుతం టీడీపీలో కనిపించడంలేదు. పార్టీ అధికారం లో ఉంది. నాయకులూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ని సైతం లెక్కచేయలేనంత స్థాయికి పార్టీలో నాయకులు వెళ్లిపోయాయి తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు.

ప్రభుత్వంపై నేతలు తిరుగుబాటు చేసేదాకా.. అధిష్ఠానం పట్టించుకోవడం లేదా.లేకుంటే పట్టడం లేదా? తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకంటే భిన్నమైనదని ఆ పార్టీనేతలు చెప్పుకుంటూ ఉంటారు. క్రమశిక్షణ తమ బ్రాండ్‌ అనేది టీడీపీ ఊతపదం. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకొచ్చాక పార్టీలో కట్టుబాట్ల విషయంలో కొందరు తమ పరిధి దాటారు. కొద్ది రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు టీడీపీ అధిష్ఠానంపై అలిగి పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం పార్టీ పెద్దల మంతనాలతో మెత్తబడ్డారు ఒక మంత్రి స్థాయిలో ఉన్న నాయకుడే ఇలా చేస్తే ఇక కిందిస్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి..?

ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలు వచ్చిన తరువాత దశాబ్ధాల టీడీపీ బ్రాండ్‌కి నష్టం కలిగే పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి. చిన్న నేతల నుంచి మంత్రులు, ఎంపీలదాకా రచ్చకెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే మంత్రి గంటా విషయంలో మాత్రం ఈ పరిణామాలు తారాస్థాయికి వెళ్లాయనే మాట వినిపిస్తోంది. కేబినెట్ సమావేశానికి రాకుండా.సీఎం కార్యక్రమానికి సైతం దూరంగా ఉంటానంటూ పార్టీపై అలిగారు.