తానో ఎకనమిక్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికి చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక నవ్వులపాలైంది  

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడ ఉంది… ఎక్కడుందంటే జపాన్..కాదు కాదు ఇండియా..ఇండియా ఇది పక్కా రైట్ ఆన్సర్ ,లాక్ చేసుకోండి .. హేయ్ నీకేమన్నా పిచ్చా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది ఆ క్వశ్చన్లోనే ఆన్సరుంది చైనాలో ఉంది.చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు..ఇండియాలో ఉంది అంటే నమ్మడానికి మేమేమన్నా ఐహాన్ అనుకుంటున్నావా..ఐహాన్,ఎకనామిక్స్ పట్టభద్రురాలు… కాని ఈవిడకి గ్రేట్ వాల్ ఎక్కడుందో తెలియక నవ్వులపాలైంది..

ఐహాన్ అనే యువతి “హు వాంట్స్ టు బి ఎ మిలియనీర్” ప్రోగ్రామ్ కి సెలక్టైంది..మన హిందిలో వచ్చే కౌన్ బనేగా కరోడ్ పతి,మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి ప్రోగ్రామే “హు వాంట్స్ టు బి ఎ మిలియనీర్”.ఈ షో ని టర్కీ ఛానెల్ నిర్వహిస్తుంది.ఈ షోలో నాలుగో ప్రశ్నగా ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుంది?’ అన్న ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించింది. దీనికి ఆప్షన్లుగా (ఎ) చైనా, (బి) హిందూస్థాన్, (సి) దక్షిణ కొరియా, (డి) జపాన్ అని జవాబులు కూడా కనిపించాయి.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఐహాన్ నానాతంటాలు పడింది.ఎంత కష్టపడిందంటే రెండు లైఫ్ లైన్లు వినియోగించుకుని సమాధానం చెప్పేంత..ఆశ్చర్యంగా ఉన్న నిజం.. ఇరవైఆరేళ్ల ఎకనామిక్స్ పట్టభద్రురాలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది.

ఇది ఆమెకు 3 వేల టర్కిష్ లిరాలు అంటే మనదేశ కరెన్సీలో రూ.38 వేలు తెచ్చిపెట్టే ప్రశ్న. దీంతో ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక ఆడియన్స్ పోల్‌కు వెళ్లింది. ఆడియన్స్‌లో 51 శాతం మంది చైనా అని చెప్పినా ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో ‘ఫోన్ ఎ ఫ్రెండ్’కు వెళ్లింది. స్నేహితుడు చైనా అని చెప్పడంతో అప్పుడు ఆమె తన సమాధానాన్ని చైనా అని చెప్పి రూ.38 వేలు గెలుచుకుంది.ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండీ ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు. అది కూడా తెలుసుకోకుండా గ్రాడ్యుయేట్ ఎలా అయ్యావని ఐహాన్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఐహాన్ తిట్ల సంగతి అలా ఉంచితే ఆమె కారణంగా షోకు విపరీతమైన పాపులారిటీ వచ్చేయగా, ఐహాన్ కూడా సెలబ్రిటీగా మారిపోయింది.