“చంద్రబాబు” కి షాక్.. “జనసేన” లోకి “గాలి” కుటుంబం     2018-05-05   07:07:37  IST  Bhanu C

చంద్రబాబు లాంటి రాజకీయ మేధావి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు..ఒక్కో సారి చంద్రబాబు చేసే ఆలోచనలు అత్యంత సన్నిహితులైన వారికి సైతం విస్మయాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహమే లేదు ఎందుకంటే పార్టీ పరువు పోయే స్మాయంలో కానీ పార్టీ నేతలు ఒడి పోతారు అనుకున్న సందర్భంలో కానీ చంద్రబాబు ఎన్నో సార్లు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు ఒక్కో సారి ఆ నిర్ణయాలు వారిని భాదపెట్టినా సరే అవి సక్సెస్ అవుతాయి అయితే చంద్రాబు తాజా నిర్ణయం మాత్రం అందుకు భిన్నంగా ఉంది..ఒక్క సారిగా చిత్తూరు నేతల మైండ్ బ్లాక్ అయ్యింది..విషయం ఏమిటంటే

చితూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఇప్పుడు బిగ్ ఫైట్ నడుస్తోందనే చెప్పాలి అక్కడ ప్రతిపక్ష పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఎమ్మెల్యే గా ఉన్నారు ఆమె మీద గాలి ముద్దు కృష్ణమనాయుడు ఓడిపోవడంతో గాలికి ఎమ్మెల్సీ గా పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించారు..అయితే గాలి హయాంలో చంద్రబాబు చెప్పింది చెప్పినట్టుగా వ్యూహాలు అమలు చేసేవారు..చంద్రబాబు మాటకి విలువ ఇచ్చావారు..పార్టీ పట్ల ఎంతో విధేయతని చాటారు..అయితే ఇప్పుడు గాలి మరణం తరువాత అక్కడ గాలి సతీమణి ఆయన వారసులు మాత్రమే ఉన్నారు..అయితే గాలి లాగా కాకపోయినా కనీసం సగ భాగం కూడా పార్టీ పై ఆ ఫ్యామిలీ కి పట్టు లేదని..చంద్రబాబు పట్ల ఎలా మెలగాలో చంద్రబాబు వ్యుహాలని అమలు పరచడంలో వారు విఫలం అవుతున్నారని తెలుస్తోంది.