గడపకు పసుపు రాసి బొట్టు పెడితే..? Devotional Bhakthi Songs Programs     2017-10-04   23:42:08  IST  Raghu V

Gadapaku pasupu raasi kunkuma bottu pedite

ప్రధాన ద్వారం గడపకు వారానికి ఒకసారైనా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది. ఒకవేళ ఆలా వీలు కాకపోతే పర్వదినాలలో అయినా పసుపు రాసి కుంకుమ పెడితే మంచిది. ఈ విధంగా చేయటం వలన లక్ష్మి దేవి ఇంటిలో ఉంటుంది. అలాగే ఎటువంటి దుష్ట శక్తులు ఇంటిలోకి రావు. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి గడపపై నల్లటి తాడుతో పటిక కడితే నర దోషం పోతుంది.

పండుగ రోజుల్లో తప్పనిసరిగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. అలాగే ఇంటిలో పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలోకి అశుభ్రమైన దుస్తులు,స్నానం చేయకుండా పరిస్థితిలోను వెళ్ళకూడదు. దేవుడి పటాలకు కుంకుమ బొట్టు,పువ్వులు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేయాలి.

దేవుడి గదిలో ఎక్కువగా దేవుడి ఫోటోలు లేదా దేవుడి ప్రతిమలు పెట్టకూడదు. నాలుగు లేదా ఐదు ఫోటోలను పెట్టి పూజ చేయాలి. పూజ గది గజిబిజిగా లేకుండా ఉంటేనే ప్రశాంతంగా పూజ చేసుకోగలం. అందువల్ల దేవుడి గది శుభ్రంగా ఉంచుకోవాలి.