మధుమేహం ఉన్నవారు ఏ పండ్లను తినవచ్చు...అసలు ఏ పండులో ఎంత చక్కర ఉంటుందో తెలుసుకుందాం.     2018-08-19   10:05:41  IST  Laxmi P

సాధారణంగా పండ్లను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అంది శరీరాన్ని ఉత్తేజితం చేస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారు పండ్లను తినకూడదని అంటూ ఉంటారు. నిజంగా మధుమేహం ఉన్నవారు పండ్లను తినకూడదా? ఒకవేళ తింటే ఏ పండ్లను తినాలి అనే విషయం తెలుసుకుందాం. పండ్లలో చక్కర శాతం ఎంత ఉందో తెలుసుకుంటే దాని ప్రకారం చక్కెర తక్కువగా ఉన్న పండ్లను హ్యాపీగా తినవచ్చు. ఇప్పుడు ఆ పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్

రోజుకొక ఆపిల్ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉండదని అంటూ ఉంటారు. ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. 100 మిల్లీ లీటర్ల యాపిల్‌ జ్యూస్‌లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.

Avocado,fruits For Diabetes,high And Low Sugar Counts,Strawberry

జామ

రోజుకొక జామకాయ తింటే చిగుళ్లు,దంతాలు బాలంగా మారతాయి. పండు అయినా కాయ అయినా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది.

అవకాడో..

అవకాడో పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మెదడు,కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. అవకాడో పండులో చాలా తక్కువ స్థాయిలో చక్కర ఉంటుంది. కేవలం 1 గ్రాము చక్కర మాత్రమే ఉంటుంది.

స్ట్రాబెర్రీ..

స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతాయి. యాంటీయాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. ఒక కప్పుడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.