అతని గురించి ఈ విషయాలు తెలుస్తే శబాష్ అనాల్సిందే. ! 300 మంది అనాథలకు కన్నబిడ్డలా అంత్యక్రియలు!     2018-08-16   11:02:34  IST  Sainath G

సొంతవారినే పట్టించుకోని కొంత మందిని మనం జీవితం లో నిత్యం చూస్తూనే ఉన్నాము. అయిన వారు చనిపోతేనే దహనసంస్కారాలు చేయడానికి నిరాకరించే మరికొంతమంది గురించి కూడా విన్నాము. మనం కులం కాదు అని అంటరాని వారి లాగ చూసేవారు కూడా ఉన్నారు. అలాంటిది ఒకతను ఎన్ని కష్టాలు అనుభవించాడో తెలీదు.. అయినవారు ఉన్నారో, లేరో తెలీదు.. చుట్టూ ఎవరూ లేని ఒక దుర్భర ఏకాంతంలో కన్నుమూశాడు.. రోడ్డుపక్కన దిక్కులేని శవంలా మారాడు. దారినపోయేవారు అయ్యో పాపం అనేసి పోయేవారు.

Hyderabad,Serve Needy Organization

మున్సిపాలిటీ వారికి ఎవరో ఫోన్ చేసారు. వాళ్ళు వచ్చే లోపే గౌతమ్ అక్కడికి చేరుకున్నాడు. అనాధ శవాన్ని తన భుజాన వేసుకున్నాడు. లోకం వీడిన ఆ అభాగ్యుడికి తన బంధువులాగా సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాడు. సైన్ వస్త్రం చుట్టి, పూలదండ వేసి, కుండ మోసి, చితికి నిప్పు పెట్టాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు.

Hyderabad,Serve Needy Organization

ఇలా గౌతమ్ చేయడం తొలిసారి కాదు. ఇప్పటివరకు 300 మందికిపైగా అనాథలకు ఏ లోటుపాటూ లేకుండాఅంత్యక్రియలు నిర్వహించాడు. వ్యయ ప్రయాసలకు ఓర్చి, స్నేహితులు అందించి ఇతరత్రా సాయంతో ఈ మహోత్కృష్ట కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు.

Hyderabad,Serve Needy Organization

తిరుపతికి చెందిన గౌతమ్ సికింద్రాబాద్‌లో స్థిరపడ్డాడు. ‘సర్వ్ నీడీ’ పేరుతో సేవాసంస్థను స్థాపించి అభాగ్యులను ఆదుకుంటున్నాడు. వీధిబాలలకు, వృద్ధులకు ఆహారం అందిస్తున్నాడు. అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తూ దిక్కులేని పిల్లకు చదువు చెప్పిస్తున్నాడు. ఒంటరిగా మొదలైన అతని ప్రయాణంలో ఇప్పుడు మరికొందరు కలిశారు. అన్నిటికంటే ముఖ్యంగా.. అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారంలో గౌతమ్ ఎంతో కృషి చేస్తున్నాడు. వృద్ధాశ్రమాలు, సర్కారీ దవాఖానలు, ఫుట్‌పాత్.. ఎక్కడెక్కడో కన్నూమూసిన అభాగ్యుల కోసం ‘లాస్ట్ రైట్స్’ విభాగంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. దహన కార్యక్రమంతోనే సరిపెట్టకుండా అస్థికలను నదిలో నిమజ్జనం చేసే బాధ్యత కూడా గౌతమ్ తీసుకుంటున్నాడు. ‘ఈ నేలపైన ఓ ఒక్కరూ అనాథగా వెళ్లిపోవద్దనే మా కోరిక..’ అని అంటున్నాడు..!