Free Anti Virus software from govt .. download it here

మన కంప్యూటర్ లో, మొబైల్ ఫోన్స్ లో వైరస్ రావడం సాధారణంగా చూసే విషయాలే. ఈ వైరస్ ని తొలగించడం కోసం రకరకాల యాంటి వైరస్ లు వాడేందుకు ప్రయత్నిస్తాం. కాని సగం సగం పనులే అవుతాయి. ఎందుకంటే ప్రీమియం వెర్షన్ లోనే ఎక్కువ సేవలు అందుబాటులో ఉంటాయి, ఆ ప్రీమియం వెర్షన్ కావాలంటే డబ్బులు ఖర్చుచేయాల్సిందే. అందుకే, భారత ప్రభుత్వం మనకు ఉచితంగా యాంటి వైరస్ ను అందించే అడుగులు వేస్తోంది.

డిజిటల్ ఇండియా కాంపేన్ లో భాగంగా సైబర్ స్వచ్ఛ్ కేంద్ర ( http://www.cyberswachhtakendra.gov.in ) అనే కొత్త వెబ్ సైట్ ని ప్రారంభించింది మన ప్రభుత్వం. ఈ సైట్ లోంచి మీరు ప్రఖ్యాత Quick Heal యాంటి వైరస్ టూల్స్ ని పూర్తి ఉచితంగా పొందవచ్చు. 32 బిట్ అయినా, 64 బిట్ అయినా, మీ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ కి తగ్గ బాట్ రిమూవల్ టూల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మీకు కావాల్సిన executable file ని డౌన్లోడ్ చేసుకోని, దాని మీద డబుక్ క్లిక్ చేసి, ఇంస్టాలేషన్ ప్రాసెస్ ని పూర్తి చేయండి. Quick Scan, Full Scan, Customized Scan .. ఇందులో మీ అవసరాన్ని బట్టి స్కాన్ చేసే పద్ధతి వాడి, సిస్టమ్ లోని మాల్ వేర్ ఐటమ్స్ ని ఏరిపారేయండి.