బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఇవి అస్సలు ముట్టుకోవద్దు    2017-01-31   23:07:00  IST  Lakshmi P

స్లిమ్ గా, ఫిట్ గా ఉండే మనుషులని ఎక్కువగా సినిమాల్లో చూడటమే తప్ప, మనకు మాత్రం బయటి ప్రపంచంలో పెద్దగా కనిపించరు. ఎందుకు అంటే ఏం చెబుతాం … శరీరంపై ధ్యాస ఉండటం వారికి అత్యవసరం .. మనకేమో ఇష్టానుసారం. ఆసక్తి ఉంటే అన్ని కరెక్టుగా మెయింటేన్ చేస్తాం లేదంటే లేదు. శరీరం యొక్క బరువు తగ్గించుకోవాలని ఆశపడే వారికి, ఆసక్తి ఉన్నవారి కోసమే ఈ సమాచారం. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ ఆహరం అస్సలు ముట్టుకోవద్దు.

* మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని బరువు తగ్గాలనుకునే వారు పండ్ల రసాలని తాగాకపోతేనే మంచిది. అలాగని పండ్లు తినకూడదని కాదు. ఎలాంటి సంకోచం లేకుండా పండ్లను తినండి కాని పండ్ల రసాన్ని తాగొద్దు. ఎందుకంటే పండుని జ్యూస్ చేయగానే అందులో షుగర్ కంటెంట్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు మీరు బరువు ఎలా తగ్గుతారు ?