ఈ ఆహారాలు రక్తపోటు (BP) ని పెంచుతాయని తెలుసా    2018-04-10   00:42:56  IST  Lakshmi P

రక్తపోటు పెరగటం వలన చిన్న రక్త నాళాలు పాడవటం, రక్తనాళాల గోడలు పాడవటం వంటి కారణాలు గుండె ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అలాగే గుణే పనితీరు మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నా లేదా వచ్చే సూచనలు ఉన్నా ఇప్పుడు చెప్పే ఆహారాలను తినటం మానేస్తే అది రక్తపోటు తగ్గటానికి మరియు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

టిన్ లలో నిల్వ చేసిన ఆహారాలను అసలు ఉపయోగించకూడదు. ఈ రోజుల్లో చాలా వాటిని టిన్ లలో నిల్వ చేస్తున్నారు. ఇలా నిల్వ ఉండటానికి సోడియం ఉపయోగిస్తారు . రక్తంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది.


కొవ్వు ఉన్న ఆహారాల పదార్ధాలను తింటే రక్తంలో కొలస్ట్రాల్ పెరిగి రక్త ప్రవాహానికి అడ్డం పడుతుంది. దాంతో రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక గ్లాస్ బీర్ లేదా వైన్ ని రెగ్యులర్ గా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే రక్తపోటు సమస్యను ఏరి కోరి తెచ్చుకున్నట్టే.