షుగర్ నార్మల్ లోకి రావాలంటే ఈ గింజలు తప్పక తినండి.! ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే?     2018-06-22   00:54:53  IST  Lakshmi P

అవిసెలు (flax seeds)… వీటి గురించి మీరు వినే ఉంటారు. ఇప్ప‌టి త‌రం వారికైతే చాలా మందికి వీటి గురించి తెలియదు. కానీ ఒక‌ప్పుడు వీటిని మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా త‌మ ఆహారంలో తీసుకునే వారు. దీంతో వారు ఇప్ప‌టికీ చాలా పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మ‌న‌మే వాటి గురించి మ‌రిచిపోయాం. అయితే మీకు తెలుసా..? అవిసెల‌ను మ‌నం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఒక గుప్పెడు అవిసెల‌ను డైరెక్ట్‌గా లేదా కొద్దిగా వేయించి నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో తీసుకుంటే దాంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అవిసె గింజల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. నాన్ వెజ్ తిన‌లేని వారు వీటిని రోజూ తింటే స‌రైన స్థాయిలో మాంస‌కృత్తులు ల‌భిస్తాయి. దీంతో కీళ్లు, ఎముక‌లు దృఢంగా మారిపోతాయి. నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

2. అవిసెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. ఆస్త‌మా వంటి అనారోగ్యాలు ఉన్న‌వారికి అవిసెలు చాలా మేలు చేస్తాయి.

3. అవిసె గింజల‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా స‌మృద్ధిగానే ఉన్నాయి. ఇవి శ‌రీరంలోని విష, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కి పంపేస్తాయి. లివ‌ర్ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

4. నిత్యం కొన్ని అవిసె గింజ‌ల‌ను తింటుంటే మ‌హిళ‌ల‌కు రుతుక్ర‌మంలో వ‌చ్చే నొప్పి త‌గ్గుతుంది. ఈ గింజ‌ల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ మ‌హిళ‌ల ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తాయి.