ఫ్లాష్ న్యూస్ : పవన్ కళ్యాణ్ కి పుత్రప్రాప్తి  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, రాజకీయ శ్రేయోభిలాషులకి ఓ శుభవార్త. మన పవర్ స్టార్ మరోసారి తండ్రి అయ్యారు. ఆధ్య, అకిరా, పోలేనా తరువాత పవన్ కళ్యాణ్ కుటుంబంలోకి మరో బుల్లి మెంబర్ వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజ్హేనేవా ఒక మగబిడ్డకు ఈరోజు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.

తెలుగు స్టాప్ ఇంతకుముందు రిపోర్ట్ చేసినట్లు, మొదట డెలివరి డేట్ గా అక్టోబర్ 14 ని డాక్టర్లు అంచనా వేసినా, జూనియర్ పవర్ స్టార్ డాక్టర్స్ అంచనాకి నాలుగురోజుల ముందే ప్రపంచాలోకి అడుగుపెట్టాడు. మూడోవ భార్య అన్నాతో పవన్ కి ఇది రెండోవ సంతానం. 2013 లో వివాహమాడిన ఈ దంపతులకి ఇప్పటికే ఓ కూతురు ఉంది. ఇక మాజీ భార్య రేణు దేశాయ్ తో పవన్ కి ఆధ్య మరియు అకిరా ఉన్నారు.

మిగితా వార్తల్లోకి వెళితే, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో “అజ్ఞాతవాసి” షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తవగానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడు పవర్ స్టార్. ఆ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి.

Photo Credits :KiMedia