దేశం విడిపోయింది, ఇండియాలో ఉండి ఏం చేస్తావు..! పాక్ కి వచ్చేయ్ అంటే అతనేమన్నారో తెలుసా.?     2018-05-23   22:54:33  IST  Raghu V

నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు. దేశం ఇప్పుడు విడిపోయింది కదా. నువ్వు పాకిస్తాన్‌ ఆర్మీలోకి వచ్చెయ్‌. నీకు ఆర్మీ చీఫ్‌ పదవిని ఇస్తాను. తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్‌గా చరిత్రలో నిలిచిపోతావు’ ఇదీ మహ్మదలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం.

అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు. అధికారులు అతడిని కలిశారు. ఒక ముస్లింగా పాకిస్తాన్‌తో చేతులు కలపమని అడిగారు. అతని చిరునవ్వు వాళ్లకి ‘అది జరిగే పని కాదు’ అని చెప్పింది. పదవి కులం వంటివి ఆదేశభక్తున్ని ప్రభావితం చేయలేక పోయాయి…. ఆయన ఎవరో కాదు బ్రిగేడియర్‌ మహ్మద్‌ ఉస్మాన్‌.

బెలూచ్‌ రెజిమెంట్‌లో బ్రిగేడియర్‌గా ఉన్న మహ్మద్‌ ఉస్మాన్‌ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, దేశ విభజన తర్వాత బెలూచ్‌ రెజిమెంట్‌ను పాకిస్తాన్‌కు కేటాయించగానే ఆయన భారతదేశం కోసం పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవిని వదులుకుని వచ్చేశారు.

దేశ విభజన తర్వాత పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయనకు, ఆయన బ్రిగేడ్‌కి జమ్మూ ప్రాంతంలోని నౌషేరా, ఝాంగర్‌ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు.