ఉదయం లేవగానే అలసటగా ఉంటుందా...అయితే ఈ ఆహారాలు మీ కోసమే  

రాత్రి లేటుగా నిద్రపోయిన మరియు పగటి సమయంలో ఎక్కువగా పని చేసిన ఉదయం లేవగానే కాస్త అలసటగా అన్పిస్తుంది. అలాగే ఈ అలసటకు పోషకార లోపం కూడా కారణం కావచ్చు. ఈ విధమైన అలసట ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుండి సక్సెస్ గా బయట పడవచ్చు. ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం .

ఓట్ మీల్

ఓట్ మీల్ లో పీచు పదార్ధం అధికంగా ఉండుట వలన జీర్ణక్రియ మెరుగుపడి ఆకలిని పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్స్,మినరల్స్ అలసట లేకుండా చేస్తాయి. అంతేకాక శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్

వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన మానసిక ఆరోగ్యాన్ని పెంచి ఏకాగ్రత బాగా ఉండేలా చేస్తాయి. అలాగే వీటిలో ఉండే పీచుపదార్ధం మరియు యాంటీఆక్సిడెంట్లు కండరాల నొప్పులను మరియు ఆందోళన తగ్గిస్తాయి.

పాల ఉత్పత్తులు

పాలలో ఉండే లాక్టోజ్ అలసటను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాలలోని ఉండే ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం మెదడులో సెరోటోనిన్ స్రావంను ప్రేరేపిస్తుంది. దాంతో అలసట అనేది తగ్గుతుంది. అయితే పాల ఉత్పత్తులు పడని వారు వాటి జోలికి వేళలకుండా ఉంటేనే మంచిది.

పప్పుధాన్యాలు

ఆరోగ్యకరమైన ఆహారాల్లో పప్పుధాన్యాలు ఒకటి. పప్పుధాన్యాలు, రక్తలేమిని తగ్గించే, ఇనుము మరియు ప్రొటీన్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిలో మీ శక్తి స్థాయిలను పెంచి, మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచే కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. కాబట్టి అలసటను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.