బాబు కే టెన్షన్ పుట్టిస్తున్న..ఇద్దరు మంత్రుల పోరు     2018-04-03   05:24:28  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారు పేరు..చంద్రబాబు గీసిన గీటు దాటరు ఎవరూ..అంటూ అందరు అంటూనే ఉంటారు అయితే అదంతా గతం అంటున్నారు తెలుగుదేశంలో ఉన్న సీనియర్ లీడర్స్..అసలు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పై పట్టుని కోల్పోతున్నారా అనే సందేహం కూడా వస్తోంది అంటున్నారు..క్రమశిక్షణ అనే మాటలు మీటింగ్స్ లో చెప్పుకోవడానికే తప్ప మరెందుకు పని చేయడం లేదు అంటున్నారు.. ఇప్పటి తరం నేతలు అయితే అసలు చంద్రబాబు మాట అస్సలు వినడం లేదంట..ఇక సీనియర్స్ అయితే చంద్రబాబు మాటని లెక్క పెట్టడం లేదని అంటున్నారు..అందుకే ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు టిడిపి పరువుని మీడియా పాలు చేస్తున్నారు..అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనేకదా సందేహం..అసలు విషయంలోకి వెళ్తే..

Fight Between AP Ministers


రోజు రోజుకి తెలుగుదేశం లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోతున్నాయి…నేతల మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ని రోడ్డుకి ఈడుస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఏపీ మంత్రులు గంటా.. అయ్యన్న మధ్య అధిపత్యపోరు ఏ రేంజ్ లో ఉందనేది వేరే చెప్పనవసరం లేదు..అందరికీ తెలిసిన విషయమే..అయితే వీరిద్దరి పుణ్యమా అని.. పార్టీ ప్రతిష్ఠ రోజు రోజు కి రెడ్డిక్కి పోతోంది .. అధినేత బాబు ఎన్నో సార్లు వీరిని మందలించినా సరే వీరిద్దరూ మాతం సై అంటే సై అంటూ కాళ్ళు దువ్వుతున్నారు..తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి రోడ్డు మీద పడ్డాయి.