కామాందుడైన తండ్రికి..కోర్టు 4 జీవిత ఖైదులు..సంచలనం రేపుతున్న తీర్పు     2018-04-26   03:13:27  IST  Raghu V

తమిళనాడులో మహిళా కోర్టు సంచలన తీర్పు ప్రకటించి..కన్న కూతురు అని మరిచిపోయి మరీ కూతురినే చెర బట్టి గర్భవతిని చేసిన తండ్రికి చచ్చే వరకూ జైలు జీవతం గడపాలి అంటూ 4 జీవిత ఖైదుల శిక్షని ఖారారు చేసింది..ఈ తీర్పు తమిళ నాట సంచలనం రేపుతోంది..వివరాలలోకి వెళ్తే

వావి వరుసలు మర్చిపోయి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు అనేకం కానీ తన కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఒక ఆడపిల్లని ఒక తండ్రి కామంతో చూశాడు.. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతను తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని హెచ్చరించాడు.