ఫ్యాన్స్‌కు చిరాకు తెప్పిస్తున్న కళ్యాణ్‌ రామ్‌     2018-05-26   01:17:00  IST  Raghu V

నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం దాటి పోయింది. కాని ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఒక్కటి కూడా లేదు. ఒకటి రెండు సినిమాలు సక్సెస్‌ను దక్కించుకున్నా అవి అప్పట్లో పెద్దగా వసూళ్లను రాబట్టడంలో సక్సెస్‌ కాలేదు. కమర్షియల్‌ సక్సెస్‌ కోసం పరితపిస్తున్న కళ్యాణ్‌ రామ్‌ తమ్ముడి సాయంను కూడా తీసుకుంటున్నాడు. తన సినిమాల వేడుకలకు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తూ పబ్లిసిటీ పొందుతున్నాడు. కాని అది కళ్యాణ్‌ రామ్‌కు ఉపయోగపడటం లేదు.

తాజాగా కళ్యాణ్‌ రామ్‌ ‘నానువ్వే’ అనే చిత్రంలో నటించాడు. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో కాస్త అంచనాలున్నాయి. దాంతో సినిమాను వారు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. తప్పకుండా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. మొదట ‘నానువ్వే’ చిత్రాన్ని ఎమ్మెల్యే కంటే ముందే విడుదల చేస్తామన్నారు. కాని కొన్ని కారణాల వల్ల కళ్యాణ్‌ రామ్‌ ఎమ్మెల్యే చిత్రాన్ని మొదట విడుదల చేశారు. అప్పటి నుండి కూడా నానువ్వే చిత్రాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.