సుధీర్ ను పెళ్లి చేసుకో అని ఓ అభిమాని అడిగితె...రష్మీ ఇచ్చిన ఈ రిప్లై చూస్తే షాక్ అవుతారు.!    2018-06-22   05:47:43  IST  Raghu V

ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. అలాంటి వాళ్లే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్. వీళ్లిద్దరి గురించి చెప్పుకోవాల్సి వస్తే… జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులరైన సుధీర్, రష్మి తమ టాలెంట్ తో సినీ రంగంలో కూడా గుర్తింపు పొందారు.

టీవీ స్కిట్లే కాకుండా సినిమాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. అయితే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇప్పటికీ ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్లిద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో బయటపెట్టరు. కనీసం ఆ రూమర్లను ఖండించను కూడా ఖండించరు. దాంతో మరిన్ని ఊహాగానాలకు రెక్కలొస్తుంటాయి.