వైసీపి లోకి మరో హీరోయిన్..  

జయప్రద తన సినీ జీవితంలో ఒక వెలుగు వెలిగిన తార..తరువాత రాజకీయ రంగప్రవేశంతెలుగుదేశం పార్టీ నుంచీ ఎన్టీఆర్ స్పూర్తితో మొదలుపెట్టింది.తరువాత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలిగా చేసింది..క్రమక్రంగా తెలుగుదేశం నుంచీ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యింది.తరువాత సమాజవాద్ పార్టీలోకి వెళ్ళింది..ఇలా ఒక్కో టైం లో ఒక్కో పార్టీలోకి వెళ్తూ ఆ పార్టీలో కీలకంగా మరేది జయప్రద..మళ్ళీ చాన్నాళ్ళ తరువాత తెలుగు రాజకీయాలమీదకి మళ్ళింది..ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో జయప్రద హాట్ టాపిక్ అయ్యింది

తెలుగు రాజకీయాల్లో తనకి తగిన పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్టు ఈ మధ్య ఆమె ప్రకటన కూడా ఇచ్చారు. ఆ తగిన పార్టీ వైసీపీ కావొచ్చని తాజాగా వినిపిస్తున్న మాట. జయప్రదకు ఆప్తుడిగా పేరుపడ్డ ఓ రాజకీయ వ్యూహకర్త ఈ విషయంలో తీసుకున్న చొరవ ఫలించిందట. పార్టీ కి జయప్రద ఏమి చేయాలి ? జయప్రదకి పార్టీలో ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే అంశం మీద ఆ వ్యూహకర్త ఓ రూట్ మ్యాప్ ఇచ్చారంట. దానికి ఇటు జగన్ సైడ్ అటు జయ సైడ్ కూడా గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే అంటున్నారు.

జయప్రదని పార్టీలోకి తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు వైసీపీ సన్నిహితులు. పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపడ్డ మహిళానేత రోజా దూకుడుతో లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోందని వైసీపీ కి ఎప్పుడో అర్ధం అయిపోయింది. మరి పార్టీకి నష్టం వాటిల్లుతుంది అని అనుకున్న టైం లో మహిళా విభాగంలోకి ఎంతో అనుభవం..సినీ గ్లామర్ ఉన్న నటి అయితేనే బెటర్ అని భావించిన వైసీపికి ఇప్పుడు జయప్రద దొరకడం చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి…ఆమె అధికారికంగా పార్టీలో చేరాక రోజాని మహిళా విభాగం నుంచీ తప్పించి ఆ భాద్యతలని జయప్రదకి అప్పగిస్తారని తెలుస్తోంది..ఈ విధంగా జగన్ రోజా చేసే డ్యామేజీ ని జయప్రదతో భర్తీ చేయనున్నాడు.